తరుచూ పార్టీ సమావేశాలకు గైర్హాజరవుతున్న 12 మంది అధికార ప్రతినిధులకు టీపీసీసీ నోటీసులు ఇచ్చింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆర్గనైజన్ ఇంచార్జ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ నోటీసులను జారీ చేశారు. సమావేశాలకు ఎందుకు హాజరుకాలేదో వెంటనే వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించారు.
నోటీసులు అందుకున్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల జాబితాలో బెల్లయ్యనాయక్, అద్దంకి దయాకర్, నేరళ్ల శారద, హరివర్థన్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, రవళి సుజాత, మానవతా రాయ్, వెంకటేష్, రియాజ్, అయోధ్య రెడ్డి, కైలాశ్ మేతా, రామంచంద్రారెడ్డి ఉన్నారు. సమావేశాలకు ఎందుకు హాజరుకాలేదనే దానిపై వీరు టీపీసీసీకి బదులు ఇవ్వాల్సి ఉంటుంది.
