బీజేపీలో చేరిన బీఆర్ఎస్, కాంగ్రెస్​ కార్యకర్తలు

బీజేపీలో చేరిన బీఆర్ఎస్, కాంగ్రెస్​ కార్యకర్తలు

బోధన్, వెలుగు: బోధన్ మండలంలోని రాజీవ్ నగర్ తండాకు చెందిన 120 మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు  మేడపాటి ప్రకాశ్​రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారు మాట్లాడుతూ నరేంద్ర మోదీ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.

 కేసీఆర్ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు మోచేతికి నీళ్లు తాగించేలా ఉన్నాయన్నారు. వీరికి బీజేపీ నాయకులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బోధన్ మండలాధ్యక్షుడు మనోహర్, సీనియర్ లీడర్లు జీలకర్ర శ్రీనివాస్, రాధాకృష్ణ, సాయిరెడ్డి పాల్గొన్నారు.