మంచిర్యాల జిల్లా జైపూర్​లో రూ.1.29 కోట్ల సీఎంఆర్ బియ్యం పక్కదారి

మంచిర్యాల జిల్లా జైపూర్​లో రూ.1.29 కోట్ల సీఎంఆర్ బియ్యం పక్కదారి
  •      శివసాయి ఇండస్ట్రీస్​ యజమానిపై క్రిమినల్ కేసు నమోదు

జైపూర్, వెలుగు : సీఎంఆర్ బియ్యం సర్కారుకు అందజేయని మంచిర్యాల జిల్లా జైపూర్​లోని శివసాయి ఇండస్ట్రీస్​కు చెందిన రైస్​మిల్​ను సీజ్ ​చేసి, యజమానిపై  క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. జైపూర్ మండలంలోని ఇందారంలో ఉన్న శివసాయి ఇండస్ట్రీస్ రైస్‌మిల్​ను మంచిర్యాల సివిల్ సప్లయీస్ ​ఆఫీసర్లు ఇటీవలే తనిఖీ చేశారు.

మిల్లు నుంచి ప్రభుత్వానికి అందజేయాల్సిన 2022–-23, 2023–-24 సంవత్సరాలకు సంబంధించిన రూ1.29 కోట్ల విలువైన సీఎంఆర్ బియ్యాన్ని పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. సివిల్ సప్లయీస్ ​ఆఫీసర్ల ఫిర్యాదు మేరకు ఆ రైస్​మిల్​ను సీజ్ చేసి, యజమాని గుంత రవికుమార్​పై క్రిమినల్​ కేసు నమోదు చేసినట్లు ఎస్​ఐ చెప్పారు.