ఏప్రిల్ నుంచి బైబ్యాక్‌‌‌‌ లాభాలపై 12% సర్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌

ఏప్రిల్ నుంచి  బైబ్యాక్‌‌‌‌ లాభాలపై 12%  సర్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌

న్యూఢిల్లీ: కంపెనీల  బైబ్యాక్ ఆఫర్‌‌‌‌లో షేర్లు విక్రయించే వ్యక్తిగత లేదా కార్పొరేట్ షేర్‌‌‌‌హోల్డర్ల మూలధన లాభాలపై ఏప్రిల్ నుంచి 12 శాతం  ఫ్లాట్ సర్‌‌‌‌చార్జ్  పడనుంది. ఇందుకు సంబంధించిన ఫైనాన్స్‌‌‌‌ బిల్లు–2026 సవరణ బిల్లును లోక్‌‌‌‌సభ తాజాగా ఆమోదించింది.  ఇప్పటి వరకు రూ.50 లక్షల వరకు మూలధన లాభంపై  సర్‌‌‌‌చార్జ్ ఉండేది కాదు.  రూ.50 లక్షల–రూ. కోటి మధ్య 10శాతం పడేది. ఇప్పుడు ఫ్లాట్ 12శాతం విధించడం వల్ల రూ.కోటి కంటే తక్కువ మూలధన లాభం పొందిన వారిపై   పన్ను భారం పెరగనుంది. 

రూ. కోటి కంటే ఎక్కువ లాభాలు పొందిన వారిపై  ఉన్న సర్‌‌‌‌చార్జ్ 15శాతం నుంచి  12శాతానికి తగ్గుతుంది. కార్పొరేట్ షేర్‌‌‌‌హోల్డర్లపై కూడా ప్రభావం ఉంటుంది. రూ. కోటి వరకు లాభంపై ముందుగా సర్‌‌‌‌చార్జ్ లేదు. ఇక నుంచి పడుతుంది. మొత్తంగా బైబ్యాక్ మూల ధన లాభం ఎంత ఉన్నా 12 శాతం ఫ్లాట్‌ సర్‌‌చార్జీ కార్పొరేట్‌, వ్యక్తిగత షేర్‌‌హోల్డర్లపై పడుతుంది.