ఈసారి పులికి ఆహారం కానున్న కంటెస్టెంట్స్.. నామినేషన్స్ వేట మొదలు

ఈసారి పులికి ఆహారం కానున్న కంటెస్టెంట్స్.. నామినేషన్స్ వేట మొదలు

బిగ్‌బాస్‌ సీజన్ 7(Bigg boss season7) 11వ వారం ఎలిమినేషన్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఎపిసోడ్ చివర్లో నో ఎలిమినేషన్‌ అనడంతో కంటెస్టెంట్లు ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఆనందాన్ని కాసేపు కూడా ఉంచకుండా వచ్చేవారం డబల్ ఎలిమినేషన్ అంటూ షాకిచ్చాడు. దీంతో కంటెస్టెంట్స్ అవాక్కయ్యారు.    

ఈ షాక్ లో ఉండగానే 12వ వారం నామినేషన్స్ మొదలెట్టేశాడు బిగ్ బాస్. తాజాగా ఆదివారం నామినేషన్స్ కు సంబందించిన ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమోలో చూస్తుంటే ఈవారం కూడా నామినేషన్స్ హోరాహోరీగానే జరిగాయని తెలుస్తోంది. ఏవిక్షన్ ఫ్రీ పాస్ కోసం జరిగిన టాస్కులలో ఫౌల్స్‌ ఆడావని యావర్‌ను అమర్‌ నామినేట్‌ చేశాడు. ఇక విల్లు గేమ్‌లో ఇద్దరూ తప్పు చేశారంటూ యావర్‌, శివాజీలను నామినేట్‌ చేశాడు అర్జున్‌. అలా గౌతమ్‌.. ప్రశాంత్‌, శివాజీని, రతిక.. ప్రశాంత్‌, అమర్‌ ని, నామినేట్‌ చేసుకున్నారు. ఇక మొత్తంగా ఈ వారంలో కెప్టెన్‌ ప్రియాంక, శోభా శెట్టి మినహాయించి మిగిలిన వారందరూ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ప్రోమోలోనే ఈ రేంజ్ వాదనలు జరిగాయంటే.. ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో అంటూ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.