
న్యూఢిల్లీ: సెబీ మంగళవారం 13 కంపెనీల ఐపీఓలకు ఆమోదం తెలిపింది. వీటిలో బోట్, అర్బన్ కంపెనీ, జూనిపర్ గ్రీన్, జైన్ రిసోర్స్ రీసైక్లింగ్, మౌరీ టెక్, రవి ఇన్‌ఫ్రాబిల్డ్ ప్రాజెక్ట్స్, పేస్ డిజిటెక్, ఆమ్నిటెక్ ఇంజినీరింగ్, కరోనా రెమెడీస్, కేఎస్‌హెచ్ ఇంటర్నేషనల్, ఆల్కెమ్ లైఫ్‌సైన్స్, ప్రయారిటీ జ్యువెల్స్, ఓమ్ ఫ్రైట్ ఫార్వర్డర్స్ ఉన్నాయి.
ఈ ఐపీఓల ద్వారా ఈ కంపెనీలు మొత్తం రూ.15 వేల కోట్లకు పైగా నిధులను సమీకరించే అవకాశం ఉంది. ఈ నిధులను విస్తరణకు, అప్పులు తీర్చడానికి ఉపయోగిస్తారు. అర్బన్ కంపెనీ రూ.1,900 కోట్ల ఐపీఓను తీసుకురావాలని యోచిస్తోంది. బోట్ రూ.2,000 కోట్ల ఐపీఓకు సిద్ధమవుతోంది. జూనిపర్ గ్రీన్ ఎనర్జీ రూ.3,000 కోట్లు, జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ రూ.2,000 కోట్లు, మౌరీ టెక్ రూ.1,500 కోట్లు, రవి ఇన్‌ఫ్రాబిల్డ్ ప్రాజెక్ట్స్ రూ.1,100 కోట్లు, పేస్ డిజిటెక్ రూ.900 కోట్లు సమీకరిస్తుంది.