హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 13 విమానాలు రద్దు చేశారు అధికారులు. మొత్తం శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఏడు విమానాలను రద్దు చేశారు. వీటిలో 5 ఇండిగో, 2 ఎయిర్‌ఇండియా విమానాలు ఉన్నాయి.
అలాగే ఢిల్లీ నుంచి శంషాబాద్ రావాల్సిన 5 ఇండిగో ఫ్లైట్స్, ఒక ఎయిర్ ఇండియా విమానం కూడా రద్దైంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎయిర్ లైన్స్ సిబ్బందిని కోరుతున్నారు
ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. విజిబిలిటీ దాదాపు జీరోకు పడిపోయింది. వెనక వస్తున్నోళ్లకు ముందు వెళ్తున్న వాహనం కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనాలు మెల్లగా వెళ్లడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఏర్పడింది. సిటీలో గాలి నాణ్యత(ఏక్యూఐ) దారుణంగా పడిపోవడంతో విపరీతమైన పొగమంచు కురుస్తున్నది. చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ సివియర్ ప్లస్ కేటగిరీలోకి పడిపోయింది
