తండ్రి వెహికల్ రివర్స్ చేస్తుండగా.. టైర్ల కిందపడి చిన్నారి మృతి

తండ్రి వెహికల్ రివర్స్ చేస్తుండగా..   టైర్ల కిందపడి చిన్నారి మృతి
  • రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లో ఘటన

అబ్దుల్లాపూర్​మెట్, వెలుగు: బంతి కోసం వెళ్లి ఓ చిన్నారి తన తండ్రి గూడ్స్​వెహికల్ కిందపడి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన కళ్లెం నరేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ మండలం లష్కర్​గూడ మెయిన్ రోడ్డు పక్కన గుడిసెలు వేసుకొని ఉంటున్నాడు. గూడ్స్ వెహికల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం తన కొడుకు లోహిత్‌‌ (13 నెలలు) ఇంటి బయట ఆడుకుంటూ బంతి కోసం గూడ్స్​వెహికల్​కిందకు దూరాడు. 

ఇదే సమయంలో తండ్రి గమనించకుండా వాహనాన్ని రివర్స్‌‌ చేశాడు. ఇంతలో బాలుడు టైర్ల కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్​స్పెక్టర్ అశోక్​రెడ్డి తెలిపారు.