Gold & Silver: న్యూ ఇయర్ ముందు గోల్డ్, సిల్వర్ నాన్ స్టాప్ ర్యాలీ.. వెండి ఏంటి బాసు ఇలా పెరుగుతోంది..?

Gold & Silver: న్యూ ఇయర్ ముందు గోల్డ్, సిల్వర్ నాన్ స్టాప్ ర్యాలీ.. వెండి ఏంటి బాసు ఇలా పెరుగుతోంది..?

మరో నాలుగు రోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో డిసెంబర్ నెల బంగారం, వెండి ఇన్వెస్టర్లకు కాసులు కురిపిస్తోంది. కానీ ఆభరణాలు కొనుక్కోవాలనుకుంటున్న రిటైల్ షాపర్లకు మాత్రం రేట్ల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలు ఇంకెప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి కొనసాగుతోంది. సంక్రాంతికి షాపింగ్ చేద్దామనుకుంటున్న చాలా మంది కూడా ప్రస్తుత రేట్లతో తమ వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. దీనికి ప్రధానంగా అంతర్జాతీయ ఉద్రిక్తతలే కారణంగా తెలుస్తోంది. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 27, 2025న బంగారం రేట్లు పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో డిసెంబర్ 26 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.120 పెరిగింది. తాజా పెంపు తర్వాత హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 122గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ గ్రాముకు రూ.12వేల 945గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ALSO READ : ఇండియాలో 32వేల మందిని రిక్రూట్ చేసుకున్న యూఎస్ టెక్ కంపెనీలు

ఇక వెండి కూడా డిసెంబర్ నెలలో దూకుడును అస్సలు బ్రేక్ లేకుండా కొనసాగిస్తోంది. ముఖ్యంగా డిమాండ్ కి తగిన స్థాయిలో సరఫరా లేకపోవటంతో సిల్వర్ రేట్ల ర్యాలీ ఆగకుండా కొనసాగుతూనే ఉంది. దీంతో డిసెంబర్ 27, 2025న వెండి రేటు కేజీకి రూ.11వేలు పెరుగుదలను నమోదు చేసింది. ఈ ర్యాలీతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 74వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.274 వద్ద ఉంది.