టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. హైదరాబాద్ లో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడ్డా టాలీవుడ్ కు లింక్ ఉండటం గమనార్హం. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్, బాలీవుడ్ లో గుర్తింపు ఉన్న ప్రముఖ హీరోయిన్ సోదరుడు ఉన్నట్లు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం హీరోయిన్ సోదరుడు కోసం ఈగల్ టీం, మాసబ్ ట్యాంక్ పోలీసులు గాలిస్తున్నారు. గత సంవత్సరం కూడా నటి సోదరుడు సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు.
డిసెంబర్ 19న ఈగల్ టీం చేపట్టిన ఆపరేషన్ లో 43 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మలక్ పేటలో ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్విలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ALSO READ : ఛాంపియన్కు చక్కని ప్రేక్షకాదరణ..
పట్టుబడ్డ ఇద్దరు వ్యాపారులకు నలుగురు రెగ్యులర్ కస్టమర్లు సప్లై చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి నటి సోదరుడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పరారీలో ఉన్న నటి సోదరుడి కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. అతడు దొరికితే డ్రగ్స్ కేసులో మరిన్ని కీలక ఆధారాలు లభిస్తాయి.
గతంలోనూ డ్రగ్స్ కేసుల్లో పలువురు ప్రముఖ నటులు డ్రగ్స్ కేసులో విచారణను కూడా ఎదుర్కోవడం తెలిసిందే. ఇపుడు మరోసారి హీరోయిన్ సోదరుడు డ్రగ్స్ కేసులో ఉండటం హాట్ టాపిక్ గా మారింది.
