మీటర్ కరెక్ట్.. పెట్రోల్ మాత్రం ఇన్ కరెక్ట్

మీటర్ కరెక్ట్.. పెట్రోల్ మాత్రం ఇన్ కరెక్ట్

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అవకతవకలకు పాల్పడుతున్న పెట్రోల్ బంకులపై ఎస్వోటీ పోలీసుల దాడులు చేశారు. పెట్రోల్ తక్కువగా వచ్చినా.. మీటర్ మాత్రం కరెక్ట్‌గా చూపించే విధంగా చిప్‌లను అమర్చి వినియోగదారుల్ని మోసం చేస్తున్నారు. అలా ప్రత్యేక చిప్‌ల ద్వారా హైదరాబాద్ పరిధిలో వినియోగదారులను మోసం చేస్తున్న 13 పెట్రోల్ బంకులను ఎస్వోటీ పోలీసులు సీజ్ చేశారు. అదేవిధంగా సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని 26 బంక్‌లను కూడా ఆ రాష్ట్ర పోలీసులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి ఇటువంటి మోసాలకు పాల్పడుతున్న 26 మందిని ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెట్రోల్ బంకు నిర్వాహకులు ముంబై నుండి ప్రత్యేక చిప్‌లను తెప్పించి.. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పెట్రోల్ బంకులలో అమర్చి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విధంగా కోట్ల రూపాయలను మోసం చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది.

For More News..

మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్

వలసకార్మికుల బస్సుకు ప్రమాదం.. ఏడుగురు మృతి

సినీఫక్కీలో వెంటాడి యువకుడి దారుణ హత్య