
సిమ్లా: రెస్టారెంట్ బిల్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య సోమవారం నాటికి 14కు చేరిందని అధికారులు చెప్పారు. సోమవారం శిథిలాల కింది నుంచి మృతదేహాలను వెలికి తీసినట్లు వివరించారు. మృతుల్లో 13 మంది 4 అస్సాం రెజిమెంట్‌కు చెందిన వారేన.ని చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఆదివారం కురిసిన భారీ వర్షానికి సోలన్ జిల్లాలోని ఓ బహుళ అంతస్తుల రెస్టారెంట్ బిల్డింగ్కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ జవాను సహా ఇద్దరు మరణించారని, పలువురు గాయపడ్డారని అధికారులు చెప్పారు. రెస్క్యూ పనులు కొనసాగిస్తుండగా సోమవారం మరో 12 మంది మృతదేహాలను గుర్తించినట్లు సైనికులు తెలిపారు. మరో 17 మంది జవాన్లు, 11 మంది సివిలియన్లు గాయపడ్డారని ఆర్మీ అధికారులు చెప్పారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని సోలన్ ఏఎస్పీ శివ కుమార్వివరించారు. సీఎం జైరాం థాకూర్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. బిల్డింగ్నిర్మాణం సరిగ్గాలేదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ప్రమాదంపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని చెప్పారు. అక్కడి నుంచి బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి సీఎం వారిని పరామర్శించారు.