
హైదరాబాద్, వెలుగు: బీహెచ్ఈఎల్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్య తీరనుంది. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి, జహీరాబాద్, నాగ్‌పూర్, పుణె, ముంబైకి రోజూ గూడ్స్ వెహికల్స్‌తో వేల సంఖ్యలో ఇతర వెహికల్స్ వెళ్తుండటంతో బీహెచ్ఈఎల్ వద్ద ప్రతి రోజు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఇక్కడ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఈ ఏడాది ఏప్రిల్ 29న శంషాబాద్‌లో జరిగిన సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ జంక్షన్లో 1.65 కిలోమీటర్ల పొడవున ఫ్లై ఓవర్ నిర్మించేందుకు రూ.130.65 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు మంత్రి మంగళవారం ట్వీట్ చేశారు. కొన్నేండ్లుగా ఇక్కడ ఫ్లై ఓవర్ నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. తాజాగా ఈ ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసింది.