కాంగ్రెస్ పార్టీ 135వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని AICC ప్రధాన కార్యక్రమంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పార్టీ చీఫ్ సోనియాగాంధీ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమానికి రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మోతీలాల్ వోరా, ఏకే ఆంటోనీ సహా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ సేవ్ కాన్స్ స్టిట్యూషన్, సేవ్ ఇండియా ర్యాలీలు నిర్వహిస్తోంది. ఈ మార్చ్ ను కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ప్రారంభించారు. కాంగ్రెస్ కార్యకర్తల కృషిని నేతలు గుర్తు చేసుకున్నారు.
Delhi: Congress interim President Sonia Gandhi hoists tricolour at party office on 135th #CongressFoundationDay. Rahul Gandhi,Dr.Manmohan Singh, Motilal Vora,AK Antony and other senior leaders present pic.twitter.com/h8GewiSUp9
— ANI (@ANI) December 28, 2019
