నైజీరియాలో 136 మంది  స్కూల్ పిల్లల కిడ్నాప్

నైజీరియాలో 136 మంది  స్కూల్ పిల్లల కిడ్నాప్

అబుజా: సెంట్రల్ నైజీరియాలోని ఓ ఇస్లామిక్​స్కూల్​నుంచి 136 మంది పిల్లలను టెర్రరిస్టులు ఎత్తుకెళ్లారు. వారం క్రితమే ఈ ఘటన జరిగినప్పటికీ ఆలస్యంగా వివరాలు బయటికొచ్చాయి. సోమవారం ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం.. టెజినా సిటీలోని స్కూల్​పై టెర్రరిస్టులు దాడి చేశారని తెలిపింది. అయితే ఎంతమంది పిల్లలను కిడ్నాప్ చేశారనేది వెల్లడించలేదు. నైజీరియాలోని కొన్ని ప్రాంతాల్లో టెర్రరిస్టులు గ్రామాలపై దాడులు చేసి సంపదను దోచుకెళ్తుంటారు. అలాగే ప్రజలను బందీలుగా తీసుకెళ్తుంటారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 700 మందికి పైగా పిల్లలు, విద్యార్థులను టెర్రరిస్టులు కిడ్నాప్ చేశారు. వీరిని రిలీజ్ చేసేందుకు ప్రభుత్వాన్ని డబ్బు డిమాండ్ చేస్తుంటారు. ‘టెజినాలోని ఇస్లామిక్ స్కూల్ నుంచి 136 మంది పిల్లలను టెర్రరిస్టులు కిడ్నాప్ చేశారు’ అని స్థానిక ప్రభుత్వం బుధవారం రాత్రి ప్రకటించింది. కిడ్నాప్ చేసిన వారిలో 11 మంది నడవలేని చిన్న పిల్లలను టెర్రరిస్టులు రిలీజ్ చేశారని అధికార0-ప్పారు.