రాజధాని ఎక్స్ ప్రెస్ లో 136 కిలోల గంజాయి

రాజధాని ఎక్స్ ప్రెస్ లో 136 కిలోల గంజాయి

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పోలీసులు తనిఖీ చేస్తుండగా రూ.  ఏసీ కోచ్ లో 20 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఎస్పీ అశోక్ కుమార్. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. గంజాయిని వైజాగ్ నుండి ఢిల్లీకి తరలిస్తున్నట్లు చెప్పారు.

జార్ఖండ్ కు చెందిన షేక్ ముజాహిద్దీన్ వైజాగ్ లో ఏసీ కోచ్ అటెండర్ గా పనిచేస్తున్నాడని..అతని తో పాటు ఉత్తరప్రదేశ్ కు చెందిన  ఆయుష్ గుప్తా రాజేష్ కుమార్ లు గంజాయిని తరలిస్తున్న వారిలో ఉన్నారని తెలిపారు ఎస్పీ తెలిపారు. వైజాగ్ లో శివ అనే వ్యక్తి నుండి గంజాయిని సేకరిస్తూ ఢిల్లీలో అమిత్ అనే వ్యక్తికి అందిస్తున్నట్లు చెప్పారు. వారిని కూడా విచారిస్తామన్నారు. వీరిపై గతంలో ఒక కేసు కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ అక్రమ గంజాయి రవాణా లో వీరితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా కేసు దర్యాప్తు చేస్తామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.  ఈ ముగ్గురు వ్యక్తులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.