గంగాధర మండలంలో 13.75 తులాల బంగారంచోరీ

గంగాధర మండలంలో 13.75 తులాల బంగారంచోరీ

గంగాధర, వెలుగు: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ గ్రామంలో సుంకనపల్లి రమేశ్​ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. రమేశ్‌‌‌‌ తన మామయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా పరామర్శించేందుకు ఈ నెల 12న తన భార్యతో కలిసి హైదరాబాద్‌‌‌‌ వెళ్లాడు. సోమవారం రాత్రి ఇంటికి వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూశాడు. 

బీరువాలో ఉన్న 13.75 తులాల బంగారు నగలు కనిపించలేదు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా చొప్పదండి సీఐ ప్రదీప్​కుమార్, గంగాధర ఎస్సై వంశీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ పేర్కొన్నారు.