సిద్దిపేట పట్టణంలో 14 మంది కేబుల్ దొంగల అరెస్ట్

సిద్దిపేట పట్టణంలో 14 మంది కేబుల్ దొంగల అరెస్ట్

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద ఉన్న కేబుల్ వైర్ల చోరీ కేసులో 14 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ వాసుదేవరావు తెలిపారు. ఈ నెల 3న పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో విలువైన కేబుల్ వైర్లు చోరీకి గురైనట్లు వచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టామన్నారు. 

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంనకు చెందిన వేముల బుజ్జి, గంజే లక్ష్మయ్య, తురక ఏడుకొండలు, వేముల బుడ్డయ్యతో పాటు, కొవ్వూరు మండలం గౌరీపట్నంనకు చెందిన గుంజ వెంకన్న, వేముల సుజాత, కుంచాల మల్లీశ్వరి, తురక వెంకటలక్ష్మి, వేముల పాటమ్మ, వేముల సత్తిరాజు, వేముల దుర్గప్రసాద్ తో పాటుగా, ఇద్దరు మైనర్లను రిమాండ్​కు తరలించినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి బొలెరో ఆటోతో పాటుగా, 260 మీటర్ల బీఎస్ఎన్ఎల్ కేబుల్ వైరు, దొంగతనానికి ఉపయోగించిన సామగ్రి,  రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.