కల్వకుంట్ల కన్నారావుకు.. 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్

 కల్వకుంట్ల కన్నారావుకు..  14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్

భూకబ్జా కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కన్నారావుకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్  విధించింది ఇబ్రహీంపట్నం కోర్టు. దీంతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు ఆదిబట్ల పోలీసులు. మరోవైపు తనపై అక్రమ కేసులు బనాయించారని త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్తానని తెలిపారు కన్నారావు. తాను తొందర్లోనే బెయిల్ పై బయటకి వస్తానన్నారు కన్నారావు. 

హైదరాబాద్ మన్నెగూడలోని ఓఎస్ఆర్ ప్రాజెక్టుకు సంబంధించిన 2ఎకరాల 10గుంటల స్థలాన్ని 38 మందితో కలిసి కబ్జా చేశారని పేర్కొంటూ ఆ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదిభట్ల పోలీసులు కన్నారావును అరెస్టు చేశారు. కన్నారావు తమ స్థలంలో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ను జేసీబీ సాయంతో తొలగించి.. కొత్త ఫెన్సింగ్ వేయడంతోపాటు గుడిసె వేసి కొందరిని కాపలా ఉంచారని శ్రీనివాస రావు ఫిర్యాదులో పేర్కొన్నారు.  

ఈ కేసుకు సంబంధించి కన్నారావు వేసిన క్వాష్, యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ని కొట్టేసింది హైకోర్టు. కబ్జాతో పాటు మారణాయుధాలతో అటాక్ చేశారనే తీవ్రమైన అభియోగాలుండటంతో ముందస్తు బెయిల్ ఇవ్వలేమంటూ హైకోర్టు కన్నారావు వేసిన పిటిషన్ ని తిరస్కరించింది