శివరాత్రి వేడుకల్లో అపశృతి..14 మంది పిల్లలకు కరెంట్ షాక్

శివరాత్రి వేడుకల్లో అపశృతి..14 మంది పిల్లలకు కరెంట్ షాక్

జైపూర్ : మహాశివరాత్రి సందర్భంగా రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లో  శుక్రవారం చేపట్టిన విగ్రహాల ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది. కోటాలోని కున్హాడి ఏరియాలో 14 మంది పిల్లలు కరెంట్ షాక్‌‌‌‌‌‌‌‌కు గురయ్యారు. గాయపడిన పిల్లలందరినీ ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు చిన్నారులకు 50 శాతానికి పైగా  కాలిన గాయాలు అయ్యాయని, వారి పరిస్థితి సీరియస్ గా ఉందని  రాజస్థాన్ హెల్త్ మినిస్టర్ హీరాలాల్ వెల్లడించారు. 

మిగిలిన వారికి 50 శాతం కంటే తక్కువ కాలిన గాయాలు అయ్యాయని తెలిపారు. లోక్ సభ స్పీకర్, కోటా ఎంపీ ఓం బిర్లా ఆస్పత్రికి చేరుకుని గాయపడిన చిన్నారులకు సరైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ ప్రమాదానికి హైటెన్షన్ ఓవర్ హెడ్ విద్యుత్ లైనే కారణమని భావిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీస్ అధికారులు వెల్లడించారు.