
హైదరాబాద్‌సిటీ, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా14 ఎక్సైజ్ స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి డివిజన్లలో12, మెదక్, వరంగల్ డివిజన్లలో ఒక్కొక్క ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లను జూన్ 28న మంత్రి జూపల్లి కృష్ణరావు ప్రారంభించనున్నారు. కొత్త స్టేషన్లకు ఎస్‌హెచ్‌ఓలుగా ప్రస్తుత ఇన్ చార్జులే విధుల్లో ఉంటారని ఎక్సైజ్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు కానున్న ఎక్సైజ్ స్టేషన్లకు కేటాయించిన ప్రాంతాలకు సంబంధించిన కేసుల రికార్డులు, స్వాధీనం చేసుకున్న గంజాయి, డ్రగ్స్, వాహనాలు, బెల్లాన్ని కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిల్వ చేయాల్సిందిగా ఎక్సైజ్ శాఖ ఆదేశాలిచ్చింది.