మహేష్ ఆఫర్ వల్ల ఏడు కోట్లు నష్టం.. డైరెక్టర్కు దిమ్మతిరిగే షాకిచ్చిన మేకర్స్

మహేష్ ఆఫర్ వల్ల ఏడు కోట్లు నష్టం.. డైరెక్టర్కు దిమ్మతిరిగే షాకిచ్చిన మేకర్స్

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్(Parasuram) పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఏ ముహూర్తాన సర్కారు వారి పాట(Sarkaruvaari pata) సినిమాను ఓకే చేశాడో తెలియదు కానీ.. అప్పటి నుండి మనోడి టైం అస్సలు బాగుండటం లేదు. రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో నాగ చైతన్య పరశురామ్ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అంటూ సెన్సషనల్ కామెంట్స్ చేశాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్(Allu Aravind) కూడా ఇండైరెక్ట్ గా పరశురామ్ పై కామెంట్స్ చేశాడు. దీంతో ఇండస్ట్రీలో మొత్తం పరశురామ్ గురించి చర్చ మొదలైంది. 

ఇక తాజాగా పరశురామ్ కు మరో షాక్ తగిలింది. కొన్నేళ్ల క్రితం పరశురామ్ నాగచైతన్య(Naga Chaitanya)తో ఒక సినిమా చెయ్యడానికి కమిట్ అయ్యాడు. ఈ ప్రాజెక్ట్ కోసం 14 రీల్స్ సంస్థ నుండి 6 కోట్లు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఇక సినిమా మొదలవుతుంది అనే టైమ్ లో పరశురామ్ కు మహేష్ బాబు(Mahesh Babu) సినిమా అఫరొచ్చింది. దాంతో నాగచైతన్య సినిమాకు హ్యాండ్ ఇచ్చాడు. 

ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమా క్యాన్సిల్ అయింది. దీంతో 14 రీల్స్ సంస్థ తమ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాలని కోరింది. తీసుకున్న అడ్వాన్స్ కు వడ్డీతో కలిపి 13 కోట్లు కట్టాల్సొచ్చింది. ఈ సెటిల్మెంట్ లో పరశురామ్ కు దిల్ రాజు(Dil Raju) చేశారట. ప్రస్తుతం దిల్ రాజు, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కాంబోలో పరశురామ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెమ్యునరేషన్ తో పాటు మరికొంత దిల్ రాజు దగ్గర అప్పు చేశాడట పరశురామ్. ఇక మొత్తంగా మహేష్ ఆఫర్ వల్ల ఈ దర్శకుడుకి 7 కోట్ల నష్టం వచ్చింది.