- ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఘటన
కామేపల్లి, వెలుగు : ఇంకుడు గుంతలో పడి ఎనిమిదో తరగతి స్టూడెంట్ చనిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని మద్దులపల్లి హైస్కూల్‌లో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన గుండా సంజీవరెడ్డి కుమారుడు ప్రణీత్‌రెడ్డి (14) స్థానిక స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన ప్రణీత్‌రెడ్డి సాయంత్రం ఆరు గంటలైనా ఇంటికి రాలేదు.
దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో స్కూల్ ఆవరణలోని ఇంకుడు గుంతను పరిశీలించగా.. అందులో ప్రణీత్‌రెడ్డి డెడ్‌బాడీ కనిపించింది. తమ కుమారుడి మరణానికి స్కూల్ హెచ్ఎం నిర్లక్ష్యమే కారణమని, ఇంకుడు గుంత తవ్విన తర్వాత ఎలాంటి రక్షణ చేపట్టకపోవడం వల్లే ప్రణీత్‌రెడ్డి చనిపోయాడని ఆరోపించారు.
