14 ఏళ్ల బాలిక గొప్ప సంకల్పం... రామాలయం నిర్మాణానికి రూ. 52 లక్షల విరాళం

14 ఏళ్ల బాలిక గొప్ప సంకల్పం...  రామాలయం నిర్మాణానికి రూ. 52 లక్షల విరాళం

సూరత్‌కి చెందిన14 యేళ్ల బాలిక అయోధ్యలోని అయోధ్యలోని శ్రీరామ మందిరానికి విశేష విరాళం అందించింది. అయోధ్య రామ మందిరానికి ఏకంగా రూ.52 లక్షలు విరాళంగా ఇచ్చింది. రామ కథలను చదివి, వాటిని చెప్పేందుకు పలు ప్రదర్శనలు ఇచ్చింది. ఇలా బాలికకు 10 సంవత్సరాల వయస్సు నుంచి రామ కథలు చెబుతూ సేకరించిన విరాళాలను అయోధ్య రామమందిరం నిర్మాణానికి విరాళంగా అందించింది..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రామాలయ ప్రారంభోత్సవం సంబరాలు అంబరాన్నంటాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య మారుమోగిపోయింది. దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో ప్రజలు వేడుకలు జరుపుకుంటున్నారు. 

14 ఏళ్ల బాలిక

అయితే గుజరాత్‌కు చెందిన ఓ 14 ఏళ్ల బాలిక రామమందిర నిర్మాణం కోసం తనవంతు కృషి చేసింది. ఏకంగా రూ.52 లక్షల విరాళాలు సేకరించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌కు చెందిన భవికా మహేశ్వరి అనే 14 ఏళ్ల బాలిక అయోధ్యలో రాముని ఆలయాన్ని నిర్మిస్తున్నారని.. ఇందుకోసం ప్రజలు విరాళాలు కూడా ఇస్తున్నట్లు తెలుసుకుంది. దీంతో తాను కూడా విరాళాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత బాలరాముడి కథలు చదవడం మొదలుపెట్టింది.

50 వేల కి.మీ ప్రయాణం

కొవిడ్ సెంటర్లు, బహిరంగ సభల్లో ప్రజలకు రామాయణ కథలు వివరించేంది. అయితే 2021లో ఓ జైలుకి వెళ్లింది. అక్కడున్న ఖైదీలకు రాముడి కథలు చెప్పింది. దీంతో వారు ఆమెకు రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఇలా భవిక 11 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే 50 వేల కిలోమీటర్లు ప్రయాణించి వివిధ ప్రాంతాల్లో 300లకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. వీటి నుంచి మొత్తం రూ.52 లక్షలు వరకు విరాళంగా వచ్చాయి.