దరఖాస్తులపై దృష్టి పెట్టి పరిష్కరించండి: కలెక్టర్ అనుదీప్

దరఖాస్తులపై దృష్టి పెట్టి పరిష్కరించండి: కలెక్టర్ అనుదీప్

హైదరాబాద్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహించే ప్రజావాణి, ప్రజా దర్బార్ లకు అందిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి నిర్వహించగా.. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి140 మంది అర్జీలు అందించారు. ప్రజాప్రతినిధులు సమర్పించిన ప్రజాదర్బార్ దరఖాస్తులను కూడా వెంటనే పరిష్కరించాలని సూచించారు.  

ప్రజావాణికి ముందు కలెక్టర్​జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించగా కాన్ఫరెన్స్​హాల్ ముందు  ప్రజలు బారులు తీరారు. దాదాపు గంటదాక నిలబడలేక ఇబ్బంది పడ్డారు.  డీఆర్వో వెంకటాచారి, ఆర్డీవోలు మహిపాల్, దశరథ్ సింగ్,  అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

రంగారెడ్డి కలెక్టరేట్ లో .. 

రంగారెడ్డి :  ప్రజావాణికి 70 ఫిర్యాదులు అందాయని రంగారెడ్డి కలెక్టర్ శశాంక తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు అర్జీలను కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్ఓ సంగీత స్వీకరించి పరిశీలించారు.  ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్  సూచించారు.  

వికారాబాద్ జిల్లాలో..

వికారాబాద్  కలెక్టరేట్ లో నిర్వహించిన  ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు 178 మంది దరఖాస్తు అందించినట్టు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.  అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్, ఆర్టీవో వాసుచంద్ర, జడ్పీ సీఈవో సుధీర్ కుమార్ సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.  

జీహెచ్ ఎంసీలో 150 అర్జీలు

ప్రజావాణి అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలని, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణికి 53 ఫిర్యాదులు వచ్చాయి.  అలాగే ఫోన్ ఇన్  ద్వారా 16 ఫిర్యాదులు వచ్చాయి. బల్దియా పరిధిలోని ఆరు జోన్లలో 97  ఫిర్యాదులు అందాయి.