గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4లో మరో 141 పోస్టులు

గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4లో మరో 141 పోస్టులు
  • ఇప్పటివరకు 7.41 లక్షల దరఖాస్తులు 

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 4లో మరో 141 పోస్టులు పెరిగాయి. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో గతంలో 289 పోస్టులు ప్రకటించారు. ప్రస్తుతం 141 పోస్టులు పెరగడంతో ఆ సంఖ్య 430కి చేరింది. జూనియర్ అసిస్టెంట్(బాయ్స్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్స్, బాయ్స్ అండ్ ఉమెన్స్) పోస్టులు 86, జూనియర్ అసిస్టెంట్స్ (గర్ల్స్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్స్, ఓన్లీ ఉమెన్స్) 55 పోస్టులు పెరిగాయి. శుక్రవారం ఫైనాన్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయా పోస్టులకు అనుమతి ఇవ్వడంతో గ్రూప్ 4 నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాటిని చేర్చారు. కాగా, గ్రూప్ 4 అప్లికేషన్లు శనివారం సాయంత్రం నాటికి 7,41,159 వచ్చాయని టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీ ప్రకటించింది. ఈ నెల 31 వరకు దరఖాస్తులకు అవకాశం ఉంది.