హైదరాబాద్‌​లో డిసెంబర్ 3న 144 సెక్షన్

హైదరాబాద్‌​లో డిసెంబర్ 3న 144 సెక్షన్

హైదరాబాద్‌, వెలుగు : ఆదివారం ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 144 సెక్షన్‌ అమలు చేయడంతో పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు విధిస్తూ 3 కమిషరేటర్ల సీపీలు సందీప్ శాండిల్య, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్‌ చౌహాన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

కౌంటింగ్‌ సెంటర్లు, పబ్లిక్ ప్లేసెస్‌లో ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడదని, పబ్లిక్ ప్లేసెస్, రోడ్లపై క్రాకర్స్‌ కాల్చకూడదని సూచించారు. రూల్స్ బ్రేక్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనిహెచ్చరించారు.