- రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, టెలిట్రాన్సిక్స్లో ఈడీ సోదాలు
హైదరాబాద్,వెలుగు : రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్ ప్రై.లిమిటెడ్ సంస్థల్లో ఈడీ శుక్రవారం సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, కర్నూలు, ఘజియాబాద్‌లోని వివిధ ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టింది. కంపెనీ డైరెక్టర్ల బ్యాంక్ ఖాతాల్లోని రూ.1.45 కోట్లను సీజ్ చేసింది. సోదాల వివరాలను ఈడీ వెల్లడించింది.
రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, టెలిట్రానిక్స్ కు చెందిన డైరెక్టర్లు, భాగస్వాములు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల వ్యాపారం పేరుతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి100ఈ కోట్లకు పైగా లోన్ తీసుకుని ఆ డబ్బులను తిరిగి చెల్లించకుండా బ్యాంకును మోసం చేశారు.