దేశంలో ఒక్క రోజులో అత్య‌ధిక క‌రోనా మ‌ర‌ణాల న‌మోదు

దేశంలో ఒక్క రోజులో అత్య‌ధిక క‌రోనా మ‌ర‌ణాల న‌మోదు

దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ రోజు రోజుకీ పెరుగుతోంది. సోమ‌వారం సాయంత్రం వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 28,380 క‌రోనా కేసుల న‌మోద‌య్యాయ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అందులో 886 మంది మ‌ర‌ణించ‌గా.. 6362 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యార‌ని చెప్పింది. ప్ర‌స్తుతం 21,132 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని వెల్ల‌డించింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1463 కొత్త కేసులు న‌మోదు కాగా, 60 మంది మ‌ర‌ణించార‌ని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ‌. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఒక్క రోజులో న‌మోదైన అత్య‌ధిక మ‌ర‌ణాల సంఖ్య ఇదే.

దేశంలో అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 8068 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గుజ‌రాత్ లో 3301, ఢిల్లీలో 2918, రాజ‌స్థాన్ లోని 2185, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో 2168 మందికి వైర‌స్ సోకింది. యూపీలో 1955, త‌మిళ‌నాడులో 1885 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఏపీలో 1177, తెలంగాణ‌లో 1002 కేసులు న‌మోద‌య్యాయి.