సర్కారు బడుల్లో కొత్తగా 1,47,103 మందికి అడ్మిషన్లు

సర్కారు బడుల్లో కొత్తగా 1,47,103 మందికి అడ్మిషన్లు
  • ముగిసిన బడిబాట ప్రోగ్రాం..అడ్మిషన్ల వివరాలు వెల్లడి 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకూ1,47,103 మంది విద్యార్థులు చేరారు. బడిబాట కార్యక్రమం ముగియడంతో అడ్మిషన్ల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్, సమగ్ర శిక్ష అధికారులు ప్రకటించారు. శుక్రవారం నాటికి ఒకటో తరగతిలో 70,116 మంది చేరినట్టు తెలిపారు. ఆరో తరగతిలో 57,133 మంది, 8వ తరగతిలో 8,820, నైన్త్ క్లాస్ లో 2,814 మంది అడ్మిషన్లు తీసుకున్నట్టు చెప్పారు. 

ఇప్పటి వరకు18,75,799 మంది విద్యార్థులకు యూనిఫామ్ అందించగా, 21,73,533 మంది స్టూడెంట్స్​కు టెక్స్ట్ బుక్స్, 11,65,748  మందికి నోట్ బుక్స్ , 4,33,337 మంది విద్యార్థులకు వర్క్ బుక్స్ అందించినట్టు పేర్కొన్నారు.