యువతులను వేధించిన ఆకతాయికి 15 రోజుల జైలు

యువతులను వేధించిన ఆకతాయికి 15 రోజుల జైలు

హైదరాబాద్‌‌, వెలుగు: యువతులను వేధించిన ఆకతాయికి నాంపల్లి కోర్టు 15 రోజుల జైలు శిక్ష విధించింది.  అడిషనల్‌‌ సీపీ ఏఆర్‌‌‌‌ శ్రీని
వాస్‌‌ తెలిపిన వివరాల ప్రకారం...బోరబండలోని పాండురెడ్డినగర్​కు చెందిన పి. విజయ్‌‌ కుమార్‌‌‌‌ ర్యాపిడో డ్రైవర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. అతడి ఫ్రెండ్ అయిన ఓ యువతి సిటీలోని 
ఓ గర్ల్స్ హాస్టల్‌‌లో ఉంటోంది. ఓసారి ఆమె  ఫోన్​ను తీసుకున్న విజయ్​కుమార్​ హాస్టల్ వాట్సాప్‌‌ గ్రూప్‌‌లో తన నంబర్ యాడ్‌‌ చేసుకున్నాడు. తర్వాత తన  అర్ధ నగ్న ఫొటోలను ఆ గ్రూప్​లో పోస్టు చేస్తూ అందులో ఉన్న 8 మంది యువతులను వేధించాడు. బాధితుల కంప్లయింట్​తో  సిటీ షీ టీమ్స్‌‌ గత నెల 15న కేసు నమోదు చేసింది. అడిషనల్ డీసీపీ శిరీషా 
రాఘవేంద్ర టీమ్‌‌ విజయ్‌‌కుమార్‌‌‌‌ను అరెస్ట్ చేసింది.  మంగళవారం కేసు విచారణలో భాగంగా నాంపల్లి పదో స్పెషల్‌‌ ఎంఎం కోర్టు విజయ్‌‌కుమార్‌‌‌‌ను దోషిగా తేల్చింది. అతడికి సెక్షన్ 290 ఐపీసీ, 70(సి) సీపీ యాక్ట్ కింద 15 రోజుల జైలు శిక్షను ఖరారు చేస్తూ మంగళవారం తీర్పు వెల్లడించింది.