న్యూ ఇయర్ కిక్కు.. నాకు పీక పెట్టకండి.. వనస్థలిపురంలో ఓ మందు బాబు హల్చల్ !

న్యూ ఇయర్ కిక్కు.. నాకు పీక పెట్టకండి.. వనస్థలిపురంలో ఓ మందు బాబు హల్చల్ !

హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని వనస్థలిపురంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. తనను ఓ కానిస్టేబుల్ కొట్టాడని రోడ్డుపై వాహనాలకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో బైక్ తాను నడపకపోయినా తనపై కానిస్టేబుల్ చెయ్యి చేసుకున్నాడని ఆరోపించాడు. తన స్నేహితుడి బైక్పై వెనకాల కూర్చున్నా అని.. తనను పట్టుకున్నారని.. బైక్ రేపు తెచ్చి ఇస్తానని చెప్పినా కానిస్టేబుల్ కొట్టడానికి వచ్చాడని సదరు వ్యక్తి ఆరోపించాడు. కొద్దిసేపు మద్యం మత్తులో రోడ్డు పై హల్చల్ చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

*న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన సిటీ పోలీసులు*
*  పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా లెక్క చేయని మద్యం ప్రియులు
* ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయిన 1198 మంది
* పట్టుబడ్డ వారందరిపై కేసు నమోదు చేసిన పోలీసులు
* డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 తెల్లవారుజాము వరకు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన పోలీసులు