తిరుమల సమాచారం.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

 తిరుమల సమాచారం..  శ్రీవారి  దర్శనానికి  15 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న ఆదివారం కావడడంతో  తిరుమలకు భక్తులు పోటెత్తారు.  శ్రీవారి దర్శనానికి   21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనానికి  15 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న శ్రీవారిని 72,256 మంది భక్తులు దర్శించుకున్నారు, 28,021 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు .. హుండీ ఆదాయం రూ.3.04 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ తెలిపింది.   రథ సప్తమి వేడుకల నేపథ్యంలో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

మరోవైపు తిరుమలలో రథ సప్తమి వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 16 తేదీ శుక్రవార రోజున   నారాయణవనం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.  టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న స్థానిక ఆలయాలలోనూ రథ సప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించటం కోసం ఏర్పాట్లు చేస్తుంది బోర్డు.  ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిని పురస్కరించుకొని టీటీడీ స్థానిక ఆలయాల్లో రథసప్తమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.