సేమ్ IMEI నెంబర్‌తో లక్షా 50 వేల ఫోన్లు: రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

సేమ్ IMEI నెంబర్‌తో లక్షా 50 వేల ఫోన్లు: రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

ప్రమాదకరమైన ఫోన్ క్లోనింగ్ స్కాం బయట పడింది. ఒకే IMEI నంబర్‌తో 1లక్షా 50వేల ఫోన్లు ఉన్నాయని  ఢాకాలో డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నిర్వహించిన సెమినార్ లో రెగ్యులేటరీ ఆఫీసర్ షాహిద్ ఆలం అన్నారు.  IMEI  అంటే ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ నెంబర్ ఈ నెంబర్ ద్వారా ఫోన్ పోతే ఆ నెంబర్ తో ట్రేస్ చేసి కనిపెడతారు. IMEI నంబర్ అనేది మొబైల్ తయారీ సమయంలో ప్రోగ్రామ్ చేయబడిన 15 అంకెల ప్రత్యేక ఐడెంటిఫైయర్. అయితే, కొన్ని మొబైల్ ఫోన్‌లు 17-అంకెల IMEI నంబర్లు కూడా ఉంటాయి. బంగ్లాదేశ్ లో ఫోన్ క్లోనింగ్ చేసి సేమ్ IMEI నెంబర్ తో 1,50,000 మొబైల్స్ ఉన్నాయని  బంగ్లాదేశ్ మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ AKM ముర్షిద్ కూడా ఓ మీడియా సంస్థకు తెలిపాడు.

ఒకే IMEI నెంబర్ పై మల్టిపుల్ మొబైల్స్ ఉంటే.. ఏ ఫోన్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఉపయోగిస్తున్నారో కనుక్కొవడం పోలీసులకు పెద్ద టాస్క్ గా మారుతుంది. సైబర్ క్రిమినల్స్ SIM క్లోనింగ్, IMEI క్లోనింగ్ అనే రెండు పద్దతులను ఉపయోగించి ఫోన్లను క్లోన్ చేస్తున్నారు. చాలా సైబర్ నేరాల్లో క్రిమినల్స్ ఫేక్  IMEI  నెంబర్ ఫోన్లను వాడుతున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. *#06# డయల్ కు కాల్ చేస్తే మీ మొబైల్ IMEI నెంబర్ తెలుసుకోవచ్చు. ఫేక్ ఈఎంఈఐ నెంబర్ ను కనిపెట్టడానికి బంగ్లాదేశ్ గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ (GSM)ని ఉపయోగిస్తుంది.