
గంజాయి రవాణాకు ఔటర్ రింగ్ రోడ్డు అడ్డాగా మారింది. సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు జంక్షన్ వద్ద ఎక్సైజ్, ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు చేసిన ఆకస్మిక తనిఖీలలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రి వెల్లడించారు.
తనిఖీలలో దాదాపు 15లక్షల విలువ చేసే 508 కిలోల గంజాయిని ఎక్సైజ్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఆంధ్ర, బీదర్ ల మద్య సరఫరా జరుగుతున్న గంజాయి రవాణా ముఠా గుట్టురట్టు చేశారు ఎక్సైజ్ అధికారులు.. ఈ విషయమై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్రీ మీడియా సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు.. ఆంద్ర నుంచీ బీదర్ కు రెండు వాహనాలలో తరలిస్తున్న 508 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని జహీరాబాద్ కు చెందిన బన్నూర్ శెట్టి,బీదర్ కు చెందిన నీలారామ్ మిత్రాజ్ లను అరెస్టు చేసినట్టు ఆయన వెల్లడించారు. కాగా ఇన్నోవ, మహేంద్ర జైలో వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. అయితే గంజాయి సరఫరాలో ప్రధాన సూత్రదారులైన జహీరాబాద్ కు చెందిన బన్సీలాల్, కర్నాటకకు చెందిన సహదేవ్, రావూఫ్ ఖాన్ లను త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు.