అయోధ్య: సరయూ నదిలో 15 మంది గల్లంతు

V6 Velugu Posted on Jul 09, 2021

అయోధ్య: స్నానం చేద్దామని నదిలోకి వెళ్లి 15 మంది మునిగిపోయిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగింది. అయోధ్యను సందర్శించడానికి వచ్చిన ఓ కుటుంబీకులు స్నానం చేయడానికి సరయూ నది, గుప్తర్ ఘాట్‌ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో వారిలో కొందరు స్నానం చేస్తుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహ వేగం పెరగడంతో వారు కొట్టుకుపోయారు. దీన్ని గమనించిన మిగిలిన కుటుంబీకులు వారికి సాయం చేసేందుకు యత్నించగా.. వారూ నీట మునిగారు. మొత్తంగా ఒకే కుటుంబానికి చెందిన 15 మంది నీట మునిగారని.. వీరిలో 9 మందిని రక్షించామని పోలీసులు తెలిపారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, దీంతో వారిని లోకల్ ఆస్పత్రిలో చేర్చామన్నారు. మరో ఆరుగురి కోసం  గజ ఈతగాళ్లు వెతుకుతున్నారని చెప్పారు. నీటిలో మునిగిన ఆ కుటుంబీకులు ఆగ్రాకు చెందిన వారని తెలిసింది. 

Tagged POLICE, Ayodhya, family members, Uttar Pradesh, rescued, drown, Search operation, Saryu River, Guptar Ghat

Latest Videos

Subscribe Now

More News