
భద్రాద్రి కొత్తగూడెం/టేకులపల్లి, వెలుగు : పురుగుల మందు కలిపిన బిందెలోని నీళ్లు తాగడంతో 15 మంది కూలీలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం తొమ్మిదో మైలుతండాలో ఆదివారం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే... తండాకు చెందిన జాటోత్ రాజు తన మిర్చి పంటకు స్ర్పే చేసేందుకు ఓ బిందెలో పురుగుల మందు కలిపాడు. మందును స్ర్పే చేసిన అనంతరం బిందెను చేను వద్దే పెట్టాడు. ఆదివారం మిర్చి నాటు వేసేందుకు వెళ్లిన కూలీలకు దాహం వేయడంతో.. ఓ వ్యక్తి మందు కలిపిన బిందెలోనే నీళ్లు తీసుకొచ్చాడు. ఆ నీళ్లు తాగిన 15 మంది కూలీలు వాంతులు చేసుకుంటూ కింద పడిపోయారు. గమనించిన మిగతా కూలీలు ఆటోలో కొత్తగూడెంలోని హాస్పిటల్‌కు తరలించారు.