ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 15 శాతం నిధులివ్వాలి: డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్

ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 15 శాతం నిధులివ్వాలి: డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్
  •     మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి: డీటీఎఫ్ 

హైదరాబాద్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రానున్న బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విద్యా రంగానికి పెద్దపీట వేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా విద్యా రంగానికి కనీసం 15 శాతం నిధులు కేటాయించాలని కోరింది. ఆదివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని డిక్కీ హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. 

ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. 2024 ఏప్రిల్ నుంచి పదవీ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇప్పటికీ పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెనిఫిట్స్ ఇవ్వలేదన్నారు. ఈ బకాయిల కోసం ప్రభుత్వం ప్రతి నెలా కేటాయిస్తున్న రూ.700 కోట్లు ఏ మాత్రం సరిపోవడం లేదని, కనీసం రూ.2 వేల కోట్లు కేటాయిస్తేనే సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కేవలం 12 జిల్లాల్లోనే డీఈవో పోస్టులు ఉన్నాయని, అందులోనూ నలుగురు మాత్రమే రెగ్యులర్ డీఈవోలు ఉండటం విచారకరమన్నారు.