- మంచిర్యాల జిల్లా పొన్నారంలో ఘటన
కోల్బెల్ట్, వెలుగు: తల్లి మందలించడంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. రామకృష్ణాపూర్ఎస్ఐ రాజశేఖర్తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రి మండలం పొన్నారం గ్రామానికి చెందిన విద్యార్థిని మాసు అక్షర(15) ను అన్నం తినమని తల్లి సావిత్రి మందలించింది.
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన బాలిక ఈనెల1న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నిచింది. తండ్రి సంతోష్వెంటనే ఆమెను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికకు సీరియస్ గా ఉండడంతో మెరుగైన వైద్యానికి కరీంనగర్ప్రతిమ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక శుక్రవారం ఉదయం మృతి చెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

