సియోల్‌ హాలో వీన్ వేడుకల్లో తొక్కిసలాట, 151 మంది మృతి

సియోల్‌ హాలో వీన్ వేడుకల్లో తొక్కిసలాట, 151 మంది మృతి

దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో జరిగిన హాలో వీన్ వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. దీంతో 151 మంది చనిపోయారు. ఈ ఘటనలో 100 మంది గాయపడ్డట్టు తెలుస్తోంది. గుండె పోటుతో ఎక్కువ మంది చనిపోయినట్టు సమాచారం. దాదాపు 400 మంది అత్యవసర సిబ్బంది, 140 అంబులెన్స్ లతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు . ఊపిరాడని పరిస్థితుల్లో రోడ్లపై పడి ఉన్న వారిని స్ట్రెచర్ల ద్వారా హాస్పిటల్ కు తరలించారు. కొందరు పౌరులు సీపీఆర్ చేశారు. 

సియోల్ లోని ఫేమస్ మార్కెట్ లో హాలో వీన్ సంబరాలు ఏర్పాటు చేశారు. కరోనాతో రెండేళ్లుగా ఈ వేడుకలు నిర్వహించలేదు. ఈసారి లక్ష మందికి పైగా హాజరయినట్టు తెలుస్తోంది. ఒక సెలబ్రిటీ వచ్చారన్న సమాచారంతో అందరూ అకస్మాత్తుగా పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగినట్టు సమాచారం. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు ఉత్తర కొరియా సర్కారు తెలిపింది. 

సియోల్ తొక్కిసలాటలో చాలా మంది చనిపోవడం దిగ్భ్రాంతికి కలిగించిందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ అన్నారు . చనిపోయిన వారి కుటుంబాలకు ట్విట్టర్ వేదికగా సానుభూతి ప్రకటించారు. ఈ కష్టసమయంలో దక్షిణ కొరియాకు అండగా ఉంటామని జైశంకర్ చెప్పారు.