ఢిల్లిని ముంచెత్తిన వాన..ఆదివారం సెలవు రద్దు చేసిన సీఎం

ఢిల్లిని ముంచెత్తిన వాన..ఆదివారం సెలవు రద్దు చేసిన సీఎం

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒకే రోజు 153మీ. వర్షపాతం నమోదైంది.  25 జూలై 1982 తర్వాత ఇదే  అత్యధిక వర్షపాతమంటూ భారత మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.

వర్షాల కారణంగా  పలు ప్రాంతాల్లో  ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. పలు ఏరియాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారులకు  ఆదివారం సెలవును రద్దు చేశారు.  సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించాలంటూ అధికారులు,  మంత్రులందరికి  ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) మంత్రి అతీషి కూడా ఈ రోజు నీటి ఎద్దడి ప్రాంతాలను సందర్శిస్తున్నారు.

ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గత రెండు రోజుల్లో కనీసం తొమ్మిది మంది మరణించారు. రానున్న రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.