
ఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా 8 నగరాలకు సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద రూ.160.97 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం వెల్లడించింది. అందులో తెలంగాణకు అందించిన నిర్భయ ఫండ్‌ను 11 రకాల ప్రాజెక్టులకు వినియోగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం లోక్ సభలో బీఆర్‌ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. మహిళలు, పిల్లలపై జరిగే సైబర్ నేరాల నివారణ ప్రాజెక్టులో భాగంగా 1,440 మందికి కేంద్ర హోంశాఖ ట్రైనింగ్ ఇచ్చిందని తెలిపారు. గత మూడేండ్లలో నేషనల్ ప్రోగ్రాం ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్‌నెస్ అండ్ విజువల్ ఇంపైర్‌మెంట్ (ఎన్‌పీసీబీవీఐ) స్కీం ఇంప్లిమెంటేషన్ కోసం తెలంగాణకు రూ.48.76 కోట్లు విడుదల చేసినట్లు మరో కేంద్ర మంత్రి ఎస్‌పీ. సింగ్ బాఘేల్ సమాధానం ఇచ్చారు. గత ఐదేండ్లలో తెలంగాణలో 79 మంది నోటరీలను నియమించామని కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ ఇంకో ప్రశ్నకు బదులిచ్చారు.