
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గడిచిన తొమ్మిదిన్నరేండ్లల్లో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉద్యోగాల ఖాళీలు, భర్తీ చేసిన వివరాలతో కూడిన వెబ్సైట్ (www.telanganajobstats.in) ను ఆయన మంగళవారం రిలీజ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రతిపక్ష నేతలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. అందుకే ఈ వెబ్సైట్రూపొందించామని వెల్లడించారు. అందరూ వెబ్సైట్ను సందర్శించి నిజాలు తెలుసుకోవాలని కోరారు. 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించి 1.60 లక్షలు భర్తీ చేశామని వివరించారు. ఉద్యోగాల భర్తీలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని స్పష్టం చేశారు.