జూబ్లీహిల్స్ బైపోల్ కు భారీ భద్రత.. కేంద్ర బలగాలతో పాటు 1600 లోకల్ పోలీసులు

జూబ్లీహిల్స్ బైపోల్ కు భారీ భద్రత.. కేంద్ర బలగాలతో పాటు 1600 లోకల్ పోలీసులు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో  ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  మొత్తం  127 పోలింగ్ స్టేషన్ల లో 407 పోలింగ్ బూత్ లు.. ఒక్కో పోలింగ్ బూత్ కి నాలుగు చొప్పున 1,628 బ్యాలెట్ యూనిట్లు సిద్ధం చేస్తున్నారు.  అదనంగా 20 శాతం బ్యాలెట్ యూనిట్లను సిద్ధంగా పెట్టుకున్నారు  అధికారులు . 509 కంట్రోల్ యూనిట్లు, 509 వీవీ ప్యాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే ఈవిఎంల ర్యాండమైజేషన్ పూర్తయింది.   

10 వేలు దాటితే చెక్కు

మరో వైపు ఇవాళ అక్టోబర్ 28న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి  కేంద్ర బలగాలు రానున్నాయి.  ఏడు కంపెనీల కేంద్ర బలగాలతో పాటు 16 వందల లోకల్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.  ఇప్పటివరకు అభ్యర్థులు చేసిన ఖర్చుల రిజిస్టర్ ను ఈ రోజు ఎన్నికల వ్యయ పరిశీలకులకు చూపించాలని ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కమిసన్.  పది వేలకు పైగా చేసే ప్రతీ పేమెంట్ చెక్కు రూపంలో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

రంగంలోకి కేంద్రబలగాలు

తనిఖీల్లో ఇప్పటివరకు రూ.2 కోట్ల 90 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు  అధికారులు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన వారిపై 11 కేసులు నమోదు చేశారు.  మసీదుల దగ్గర  ప్రచారం చేసినందుకు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై కేసు నమోదు చేశారు పోలీసులు.  ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వకుండా మాజీ మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ లు ప్రచారం చేసినందుకు మరో కేసు నమోదు చేశారు.  

బరిలో 58 మంది

 జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత ఉన్నారు. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. 14న కౌంటింగ్ జరగనుంది.