పోలీస్ నోటిఫికేషన్ : పోస్టుల వివ‌రాలు

పోలీస్ నోటిఫికేషన్ : పోస్టుల వివ‌రాలు

హైదరాబాద్: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. రాష్ట్రంలో పోలీస్ నియామకాలకు సంబంధించిన  నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ పోలీస్ రిక్యుర్మెంట్ బోర్డు. ఇందుకు సంబంధించిన జీవోను సోమవారం విడుదల చేసింది. 16,027 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలంగాణ పోలీస్ రిక్యుర్మెంట్ బోర్డు తెలిపింది. పూర్తి వివరాలకు సంబంధిత వెబ్ సైట్ చూడాలని సూచించింది.

ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌
ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి. మే 2వ తేదీ నుంచి మే 20వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌తో పాటు త‌దిత‌ర వివ‌రాల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు.

ఎస్ఐ పోస్టుల వివ‌రాలు
సివిల్ ఎస్ఐలు -414
ఏఆర్ ఎస్ఐలు -66
ఎస్ఏఆర్ సీపీఎల్ ఎస్ఐలు -05
టీఎస్ఎస్‌పీ ఎస్ఐలు -23
స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్ ఎస్ఐలు -12
విప‌త్తు నిర్వ‌హ‌ణ, అగ్నిమాప‌క శాఖ -26
జైళ్ల శాఖ -08
ఐటీ అండ్ క‌మ్యూనికేష‌న్ ఎస్ఐలు -22
పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గ‌నైజేష‌న్ – -3
ఫింగ‌ర్ ప్రింట్ బ్యూరోలో ఏఎస్ఐలు -08

కానిస్టేబుల్ పోస్టుల వివ‌రాలు..
సివిల్ కానిస్టేబుల్స్ -4965
ఏఆర్ కానిస్టేబుల్స్ – 4423
ఎస్ఏఆర్ సీఎల్ – 100
టీఎస్ఎస్‌పీ – 5010
స్టేట్ స్పెష‌ల్ పోలీసు ఫోర్స్ – 390
విప‌త్తు నిర్వ‌హ‌ణ, అగ్నిమాప‌క శాఖ -610
జైళ్ల శాఖ(పురుషులు) – 136
జైళ్ల శాఖ(స్త్రీలు )-10
ఐటీ, క‌మ్యూనికేష‌న్ -262
పోలీసు కానిస్టేబుల్ (మెకానిక్)-21
పోలీసు కానిస్టేబుల్ (డ్రైవ‌ర్) -100

అసలే 8 మ్యాచ్ లు ఓడిపోయామన్న బాధతో ఉంటే.. కృనాల్ ఓవరాక్షన్..!

ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్