ఒకే రోజు 1603 అప్లికేషన్లు.. రేపే(సెప్టెంబర్ 10)లాస్ట్ డేట్

ఒకే రోజు 1603 అప్లికేషన్లు.. రేపే(సెప్టెంబర్ 10)లాస్ట్ డేట్

బీజేపీ అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.  అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కోసం దరఖాస్తు గడువు సెప్టెంబర్ 10తో లాస్ట్ డేట్ కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి.అనుచరులతో నాయకులు తరలి వస్తుండటంతో కార్యాలయం కిక్కిరిసిపోయింది. సెప్టెంబర్ 9న 1603 అప్లికేషన్లు వచ్చాయి.  ఇప్పటి వరకు మొత్తం 3223 దరఖాస్తులు వచ్చాయి.

సెప్టెంబర్ 10 ఏకాదశి,పునర్వసు నక్షత్రం ఉండటంతో ఎక్కువ దరఖాస్తులు వస్తాయని తెలుస్తోంది. ఇవాళ శనివారం కారణంగా పలువురు ముఖ్య నేతలు అప్లికేషన్లు పెట్టలేదని సమాచారం.  భువనగిరి నుంచి  సీనియర్ నాయకులు గూడురు నారాయణ రెడ్డి,  షాద్ నగర్ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు దరఖాస్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ టికెట్ కోసం మాజీమంత్రి శంకర్ రావు కూతురు సుస్మిత దరఖాస్తు చేసుకున్నారు. నారాయణఖేడ్ నుంచి సంగప్ప, పరిగి నుంచి మారుతికిరణ్, నర్సాపూర్ నుంచి గోపి, జనగామ నుంచి ఓయూ జేఏసీ నేత సంతోష్ ముదిరాజ్ దరఖాస్తు చేసుకున్నారు. 

ALSO READ : జీ మెయిల్ లో ఎమోజీ రియాక్షన్స్..

ఏ రోజు ఎన్ని దరఖాస్తులంటే?

4 వ తేదీన 182
5వ తేదీన 178
6వ తేదీన 306
7వ తేదీన 333
8వ తేదీన 621
9 వ తేదీన 1603