ఢిల్లీలో 1700మంది పోలీస్ సిబ్బందికి క‌రోనా

ఢిల్లీలో 1700మంది పోలీస్ సిబ్బందికి క‌రోనా

దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి.  ప్ర‌తిరోజు 30వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు ఆంక్ష‌ల‌ను విధించింది ఢిల్లీ ప్ర‌భుత్వం. కరోనా బారిన పడుతున్న వారిలో పోలుసులు ఎక్కువగానే ఉన్నారు.  రీసెంట్ గా 1700మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. హోం గార్డుల నుంచి… SIలు, CIల తో పాటు ఉన్నతస్థాయి అధికారులు క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి జనవరి 12 తేదీల మధ్యలోనే 1700 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీస్‌ శాఖ ప్రకటించింది.  గడిచిన 24 గంటల్లోనే… 21,259 కరోనా నమోదయ్యాయి.  నిన్న ఒక్క రోజే 23 మంది కరోనా కారణంగా చనిపోయారు.

మరిన్ని వార్తల కోసం..

ఇంకా ఐసీయూలోనే సింగర్ లతా మంగేష్కర్