
బాల్కొండ, వెలుగు : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు శనివారం 17408 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుందని ఇరిగేషన్ ఆఫీసర్లు తెలిపారు. వానాకాలం పంటలకు 8239 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
కాకతీయ కెనాల్ కు 3500 క్యూసెక్కులు, వరద కాలువకు 3000 క్యూసెక్కులు, సరస్వతీ కెనాల్ కు 300, అలీసాగర్ 360, లక్ష్మీ కాలువకు150, గుత్ఫ లిఫ్టు కోసం 270 క్యూసెక్కులు, మిషన్ భగీరథ తాగునీటి కోసం 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు, 80.50 టీఎంసీలు కాగా, శనివారం సాయంత్రానికి 1078.40 అడుగులు,40.86 టీఎంసీల నీరు ఉంది.