
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 178 మంది అసిస్టెంట్ ఫ్రొఫెసర్లకు పదోన్నతులు లభించాయి. ఈ మేరకు వివిధ సబ్జెక్టుల్లో అర్హులైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు (అకడమిక్ లెవెల్–12).. అసోసియేట్ ప్రొఫెసర్లుగా (అకడమిక్ లెవెల్ –13ఏ) ప్రమోషన్ పొందారు. దీంట్లో మల్టీజోన్–1లో 86 మంది, మల్టీజోన్–2లో 92 మందికి ప్రమోషన్లు ఇస్తూ అధికారులు ఉత్తర్వులిచ్చారు. తెలుగు సబ్జెక్టు నుంచి 28 మంది, ఎకనామిక్స్ నుంచి 21 మంది, కెమిస్ట్రీ నుంచి 19 మంది, కామర్స్ నుంచి 17 మంది, బాటనీ నుంచి 17 మంది ప్రమోషన్లు లభించాయి.