గరిడేపల్లి, వెలుగు: గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో స్థానిక ఎన్నికల్లో కౌంటింగ్ ఏజెంట్ పై జరిగిన దాడి కేసులో 18 మంది కేసు నమోదు చేసినట్లు ఎస్సై చలికంటి నరేష్ తెలిపారు. బుధవారంజరిగిన ఘర్షణలో ఎడవెల్లి చంద్రారెడ్డి అనే మాజీ సర్పంచ్ కౌంటింగ్ ఏజెంట్ గా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కౌంటింగ్ ఏజెంట్‌గా ఉన్న చంద్రారెడ్డి పై బీఆర్ఎస్ అభ్యర్థి కుటుంబ సభ్యులు, కొందరు స్థానిక, స్థానికేతరులు అల్లరి మూకలను వెంటబెట్టుకొని కౌంటింగ్ హాల్ పై దాడి చేశారు.
ఈ దాడిలో గాయపడిన ఎడవెల్లి చంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పది మంది పై కేసు నమోదు చేశారు. వాట్సాప్, ఇంస్టాగ్రామ్ లలో ఫేక్ న్యూస్ క్రియేట్ చేసిన కొంతమందిపై కేసు నమోదు చేశారు. మొత్తం 18 మందిని శుక్రవారం రోజు హుజూర్‌నగర్ ఆర్డీవో ముందు బైండోవర్ చేశామని ఎస్సై నరేశ్ తెలిపారు.
